ETV Bharat / state

విషాదం: చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతి - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తండా చెరువులో పడి గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఎగువ తండాకు చెందిన ఇద్దరు మహిళలు నిన్న దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా... వారితోపాటు వచ్చిన ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ లోతుకు వెళ్లిపోయారు. మహిళలు గుర్తించేలోగా వారు గల్లంతయ్యారు.

చెరువులో గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతి

author img

By

Published : Oct 12, 2021, 11:17 AM IST

అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తండా చెరువులో పడి గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఎగువ తండాకు చెందిన ఇద్దరు మహిళలు నిన్న దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లగా... వారితోపాటు వచ్చిన ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ లోతుకు వెళ్లిపోయారు. మహిళలు గుర్తించేలోగా వారు గల్లంతయ్యారు. చిన్నారులు లాలూప్రసాద్‌, పురుషోత్తం, హేమంత్‌ కోసం నిన్నటి నుంచి చెరువులో గాలించగా... తెల్లవారుజామున ముగ్గురు మృతదేహాలు నీటిపైకి తేలాయి.

ముగ్గురు చిన్నారుల మృతితో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చెరువులో గల్లంతైన చిన్నారులు ముగ్గురు మృతి చెందడంతో తల్లితండ్రులు రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన గ్రామస్థులను కలిచివేసింది. గల్లంతైన పిల్లల్లో నాగరాజు, చిన్నిల కుమారుడు లాలు ప్రసాద్ నాయక్, అలాగే శాంతమ్మ, గోపినాయక్ ల పిల్లలు పురుషోత్తం నాయక్, హేమంత్ నాయక్ ఉన్నారు.

ఇదీ చదవండి: Conflict: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో రెవెన్యూ శాఖ, పోలీసులకు మధ్య వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.