నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అనంతపురం జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు. పరిగి మండలం శ్రీగిపల్లికి చెందిన వడ్డే పూర్ణచంద్ర.. పట్టణంలోని స్టేట్ బ్యాంకు ఏటీఎంలలో నగదు తీసుకోవడానికి వచ్చే వారి దృష్టి మళ్లించి కార్డులను దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటితో డబ్బు డ్రా చేస్తున్నట్లు వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడిన పూర్ణచంద్ర.. ఏటీఎంల వద్ద చోరీలకు పాల్పడుతూ, దొంగిలించిన సొమ్ముతో ద్విచక్రవాహనం, ఖరీదైన మొబైల్ కొనుగోలు చేశాడని డీఎస్పీ భవ్య కిషోర్ చెప్పారు. జూదం ఆడేందుకు మరో రూ.50 వేలు ఖర్చు చేేసినట్లు తెలిపారు. అతడు కదిరిలో ఉన్నట్లు సమాచారం రావడంతో అరెస్టు చేసి.. ఓ ద్విచక్ర వాహనం, మొబైల్, రూ. 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: