అనంతపురం జిల్లా కథల వీధికి చెందిన ఓ ఇంట్లో కరోనా రోగి మరణించిన కారణంగా.. బంధువులంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. దుండగులు ఈ ఇంట్లోకి చొరబడి 3 లక్షల నగదుతో పాటు 8 తులాల బంగారు ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల నివాసముంటున్న స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రెండవ పట్టణ సీఐ గోవిందు ఇంట్లోకి వెళ్లి చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులను సేకరించి వీడియోకాల్ ద్వారా బాధితులతో మాట్లాడారు. పోయిన వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: