అనంతపురం జిల్లా కదిరిలో... తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని రహమత్ నగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమ్మద్ రియాజ్ కుటుంబం రంజాన్ సందర్భంగా... స్వగ్రామమైన పులగంపల్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేని విషయాన్ని గుర్తించిన దుండగులు తాళం పగలగొట్టారు.
ఇంట్లోని 7 తులాల బంగారం, రూ.35 వేల నగదు, పట్టు చీరలు అపహరించారు. సొంత ఊరు నుంచి తిరిగొచ్చిన మహమ్మద్ రియాజ్... తాళం తెరిచి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి పరిశీలించగా చోరీ జరిగినట్లు తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: