ETV Bharat / state

జలాశయం ఆపాలంటూ..వెంకటాంపల్లి గ్రామస్థుల ఆందోళన - venkatampalli riservoir latest news update

అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వెంకటాంపల్లిలో జలాశయాన్ని ఆపలంటూ నినాదారు చేశారు. గ్రామస్థులతో సంప్రదించకుండా గ్రామాన్ని ఎక్కడికి తరలిస్తారంటూ ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్​ను కలిసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు.. ఇద్దరు మాత్రమే కలెక్టర్​ను కలిసేందుకు అనుమతించారు.

villagers protest to stoped the reservoir
జలాశయం ఆపాలంటూ గ్రామస్థులు ఆందోళన
author img

By

Published : Dec 15, 2020, 2:44 PM IST

జలాశయం నిర్మాణంతో ఊరును ముంచేస్తున్నారంటూ అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం సీకే పల్లి మండలంలోని వెంకటాంపల్లిలో జలాశయం నిర్మాణానికి ముఖ్యమంత్రితో భూమి పూజ చేయించిన జలవనరులశాఖ ఇంజనీర్లు.. తమతో మాట మాత్రం కూడా చెప్పలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లోనే హడావుడి చేసి, ప్రాజక్టు నిర్మిస్తున్నామంటూ మంత్రులతో సమావేశం పెట్టారని ఆరోపించారు.

గ్రామస్థులతో సంప్రదించకుండా.. గ్రామాన్ని ఎక్కడికి తరలిస్తారో ప్రకటించకుండా అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. వెంకటాంపల్లి గ్రామాన్ని ముంచేసి ప్రాజెక్టు కడతామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోమని గ్రామస్థులు హెచ్చరించారు. గ్రామస్తులంతా జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్​ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకొని, ఇద్దరిని మాత్రమే అధికారుల వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

ఇవీ చూడండి...

'అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.