అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని 600 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. ఉత్తర ద్వారం తాళం బద్దలు కొట్టి ఆలయంలోని రాతి కమలం ధ్వంసం చేసి.. గర్భ గుడిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ (అత్యంత పురాతన) విగ్రహాన్ని దోచుకెళ్లారు.
పూజల నిమిత్తం వేకువ జామున అర్చకులు ఆలయాన్ని తెరిచారు. ఈ క్రమంలో ఉత్తర ద్వారం తలుపులు తెరిచి ఉండటంతో ఆలయ కమిటీ సభ్యులకు, పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తేజోమూర్తి, తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రప్పించి విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండీ… a