ETV Bharat / state

పోలీసుల వేధింపులతో..యువకుడి బలవన్మరణం ! - police harrasment

అనంతపురం జిల్లాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి పోలీసుల వేధింపులే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు.

ఆత్మహత్య
author img

By

Published : Oct 2, 2019, 7:18 PM IST

యువకుడి ప్రాణం తీసిన పోలీసుల వేధింపులు!

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం సిబాబి గ్రామంలో జయన్న అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు వేధింపులే కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

జయన్న విద్యుత్ సబ్​స్టేషన్​లో వాచ్​మెన్​గా పని చేస్తున్నాడు. ఈ సబ్​స్టేషన్​లో రెండేళ్ల క్రితం చోరీ జరిగినట్లు పోలీసు కేసు నమోదైంది. సంవత్సరం క్రితం విధుల్లో చేరిన జయన్నను పోలీసులు ఈ విషయంపై వేధిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. 3 రోజులుగా వేధింపులు అధికమై జయన్నను పోలీసులు కొట్టారని అన్నారు. ఈ పరిణామాలతో అవమానాన్ని భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఆ ప్రాంగణమంతా బంధువుల రోదనలతో ఉద్రిక్తతగా మారింది. తమకు న్యాయం చేయాలని జయన్న మృతదేహంతో బంధువులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

Intro:AP_RJY_ARTICLE 370 AVGAHANA SADASSU_AVB_AP10022_EJS PRAVEEN

Body:AP_RJY_ARTICLE 370 AVGAHANA SADASSU_AVB_AP10022_EJS PRAVEEN

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.