kia unit record: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న కియా ఇండియా యూనిట్ రెండున్నరేళ్లలోనే 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 4 లక్షల కార్లను దేశీయంగా విక్రయించగా, ఇతర దేశాలకు లక్ష కార్లు ఎగుమతి చేసింది.
2019 సెప్టెంబరులో కియా సెల్టోస్ మోడల్‌తో ఎగుమతులు ప్రారంభించి, ఇప్పటివరకు 91 దేశాలకు ఇక్కడినుంచి కియా కార్లను ఎగుమతి చేసినట్లు కియా ఇండియా వివరించింది. గత ఏడాది కార్ల ఎగుమతుల్లో 25 శాతం కియా ఇండియావే కావడం మరొక ప్రత్యేకత. 5 లక్షల కార్లను కేవలం 2.5 ఏళ్లలో విక్రయించి రికార్డు సృష్టించామని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తే-జిన్ పార్క్ వివరించారు.
ఇదీ చదవండి:
8 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన వ్యక్తి అప్పగింత.. సంతోషంలో కుటుంబ సభ్యులు!