రాయలసీమ జిల్లాలకు.. సాగునీటి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎదుర్కోవాల్సిందేనని సీమ జిల్లాల తెలుగుదేశం నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల నీటి ప్రాజక్టుల భవిష్యత్తుపై నాయకులు అనంతపురంలో సదస్సు నిర్వహించారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు హాజరైన నేతలు ముక్తకంఠంతో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్న జగన్ తీరుతో రాయలసీమ జిల్లాలకే ఎక్కువగా నష్టం జరుగుతోందని ఆక్షేపించారు. చివరి ప్రాంతంలో ఉన్న చిత్తూరు జిల్లాకు వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని.. హక్కుల కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
"ఆవులపల్లి రిజర్వాయర్ను నింపడానికి కుప్పం, పలమనేరును ఎండబెడుతున్నారు. ఈ పని అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చేస్తున్నారు" -అమరనాథరెడ్డి, మాజీ మంత్రి
"రాయలసీమ హక్కుల కోసం తెలుగు దేశం పార్టీ పోరాడుతుంది. రాయలసీమలో నీటి ప్రాజెక్టుల సమస్యలపై సీమలోని 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజలతో సదస్సును నిర్వహిస్తాం" -కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి
ఇదీ చదవండి: రాయలసీమ సాగు ప్రాజక్టులకు జరిగన అన్యాయంపై నేడు చర్చించున్న తెదేపా నేతలు