తుంగభద్ర బోర్డు మండలి తొలి సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. ఈ ఏడాది కూడా తుంగభద్ర జలాలతో ఉప్పొంగనుందని బోర్డు అంచనా వేస్తోంది. ఆయకట్టుకు, సాగునీటికి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ సారి తుంగభద్ర జలాశయానికి 199 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని.. 170.8 టీఎంసీలు వినియోగంలోకి రానున్నది. ఏపీకి 52.698, కర్ణాటక రాష్ట్రానికి 110.143, తెలంగాణ రాష్ట్రానికి 5.159 టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏపీ కోటాలో హెచ్ఎల్‌సీకి ( తుంగభద్ర ఎగువ కాలువ కు) 25.755 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండీ.. కూర్చున్న చోటే మహిళ ప్రసవం.. మంత్రి ఆరా