కార్తిక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా కదిరి ఉమామహేశ్వర ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి దీపారాధాన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి సోమవారం రావటంతో...ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. భక్తుల సంఖ్య పెరగటంతో మహాత్మగాంధీ రోడ్లో వాహన రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు భక్తులను వరుసలో వెళ్లేలా సూచిస్తూ...బందోబస్తూ నిర్వహిస్తున్నారు.
కార్తిక పౌర్ణమితో కిక్కిరిసిన ఆలయం
అనంతపురం జిల్లా కదిరిలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక పౌర్ణమి సోమవారం రావటంతో... ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.