ఏపీలో మహిళలకు రక్షణ లేకుండాపోతోందని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. ధర్మవరం మండలం బడన్నపల్లిలో హత్యకు గురైన స్నేహలత మృతదేహాన్ని పరిశీలించి.. ఆమె తండ్రి కుల్లాయప్పను పరామర్శించారు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో.. వారికే రక్షణ లేకపోవడం దారుణమన్నారు. నిందితులను వెంటనే శిక్షించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
యువతి అదృశ్యం కేసులో అనంతపురం ఒకటవ పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి నిర్లక్ష్యం వహించారని.. ఎస్సీ సంఘం నాయకులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే.. ధర్మవరంలో స్నేహలత హత్యకు గురైందని ఆరోపించారు. గతంలోనూ అనేక సందర్భాల్లో.. సీఐ ఇదేవిధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: