ETV Bharat / state

'పేద వాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్​ను మూసేస్తారా..?'

అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి, తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. అన్న క్యాంటీన్ వద్ద ధర్నా నిర్వహించి.. వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్లను మూసి వారి పొట్ట కొట్టారని ఆక్షేపించారు.

prajachaitanya yathra
'పేద వాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్​ను మూసేస్తారా?'
author img

By

Published : Feb 25, 2020, 8:53 PM IST

ప్రభుత్వంపై కాల్వ శ్రీనివాసులు విమర్శలు

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని అన్న క్యాంటీన్ వద్ద తెదేపా ధర్నా నిర్వహించింది. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా... ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టే అన్న క్యాంటీన్​ను మూసి వేయటం వైకాపా ప్రభుత్వానికి తగదని కాల్వ అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన వెంటనే... ముందు అన్న క్యాంటీన్లనే లక్ష్యంగా పెట్టుకుని మూసివేశారని దుయ్యబట్టారు. వాటికి రంగు మార్చి సచివాలయం ఏర్పాటు చేసి పేదవాడి పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాలంటే ప్రజా సమస్యలు తీర్చేవని... ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అవి కొత్త సమస్యలు తెచ్చేవిగా ఉన్నాయని అన్నారు. అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

నమ్మండి..ఇది గుడ్డేనండీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.