వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేళ్లలో రాయలసీమ సాగు ప్రాజక్టులకు జరిగన అన్యాయంపై సీమ జిల్లాల తెదేపా నేతలు ఇవాళ చర్చించనున్నారు. అనంతపురం నగరంలోని కమ్మభవన్లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు నాలుగు జిల్లాల నుంచి తెదేపా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ఏ ఒక్క ప్రాజక్టుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటున్న నేతలు... గణాంగాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో తెదేపా ప్రభుత్వం హంద్రీనీవా రెండు దశల పనులను పూర్తిచేసినప్పటికీ, పిల్లకాలువలు నిర్మించి ఆయకట్టు స్థిరీకరణ చేయటంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంపై చర్చించనున్నారు. కరవు జిల్లాల్లో ప్రధానమైన హంద్రీనీవా, హెచ్చెల్సీ ప్రాజక్టులు, కాలువలపై ప్రభుత్వ నిర్లక్ష్య దోరణి చూపుతుందంటున్న నేతలు.. జిల్లాల వారీగా వివరాలను సేకరించారు. ఆయా జిల్లాల్లో సాగునీటి ప్రాజక్టుల పనులు నిలిపివేసిన వైనం, రైతులు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ సదస్సు ద్వారా తెదేపా నేతలు ఎండగట్టనున్నారు. పుష్కలంగా వర్షాలు కురుస్తున్నా కాలువలకు కనీస మరమ్మతులు చేయని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుతో సీమకు జరుగుతున్న నష్టాన్ని అందరికీ కళ్లకు కట్టినట్లుగా వివరించటానికి నేతలంతా సన్నద్ధమయ్యారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి