తెదేపా కార్యకర్తలెవరూ అక్రమ కేసులకు భయపడరని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జేసీ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి తాడిపత్రి వస్తున్న లోకేశ్‌కు అనంతపురం జిల్లా గుత్తి పట్టణం వద్ద తెదేపా నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం లోకేశ్‌తో పాటు పలువురు తెదేపా నాయకలు జేసీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే అరెస్ట్‌లు: కాల్వ
వైకాపా ప్రభుత్వం తెదేపా నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేసి... మానసికంగా దెబ్బ తీస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తొందరలోనే జగన్ సర్కారుకు ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని కాల్వ అన్నారు.
ఇవీ చదవండి: