ETV Bharat / state

వైసీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా పోలీసు వ్యవస్థ: టీడీపీ

author img

By

Published : Nov 28, 2022, 8:50 PM IST

Updated : Nov 28, 2022, 9:29 PM IST

TDP Reaction on YSRCP leaders comments on Babu Family: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైసీపీ నాయకుల చేతుల్లో కీలకబొమ్మగా మారిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. తెలుగు యువత చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి ముట్టడిని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.

TDP
టీడీపీ

TDP REACTION RAPTADU MLA BROTHER COMMENTS : రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దూమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురంలో తెలుగు యువత, టీడీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. చంద్రశేఖర్‌రెడ్డి ఇంటి ముట్టడికి తెలుగు యువత నాయకులు వెళ్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

వైసీపీ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా పోలీసు వ్యవస్థ: టీడీపీ

అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఉమ్మడి అనంతపురం తెలుగుదేశం నేతలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. పోలీసు వ్యవస్థ వైసీపీ నేతల చెప్పుచేతుల్లో పనిచేస్తూ ప్రజల హక్కుల్ని కాల రాస్తోందని విమర్శించారు. రాజ్యాంగేతర శక్తులు సలహాదారులుగా ఉండటం వల్లే పోలీసు వ్యవస్థపై నేతలు పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు.

"అనరాని మాటలు అనటంతో పాటు. అసభ్యమైన పదజాలంతో చేసిన హెచ్చరిక చట్టరిత్యా నేరం. కానీ, మేము ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. దీనిపై ఎస్పీని కలిశాము. అధికార పార్టీ కోసమో, నాయకుల కోసమో పోలీసు వ్యవస్థ ఉంటే.. దానిపై ప్రజలలో నమ్మకం పోతుంది." -కాలవ శ్రీనివాసులు, తెలుగుదేశం నేత

"పోలీసు వ్యవస్థకు కొత్త నిర్వచనాన్ని ఆంధ్రప్రదేశ్​ ప్రభుతం ఇచ్చింది. అధికార పార్టీ ఇచ్చే ఆదేశాలను అమలు చేయాటానికి పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు డీజీపీ కాకుండా ఇతర వ్యక్తులు ఆదేశాలు ఇస్తున్నారు." -పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే

సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైల్లో ఉన్న తెలుగుదేశం నేత జగ్గును పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, పార్థసారథి పరామర్శించారు . పోలీసుల తీరుపై మండిపడ్డారు.

"పోలీసులు జగ్గుమీద చూపించిన ఉత్సహం చందుమీద ఎందుకు చూపెట్టలేదు. చందు చేసిన వ్యాఖ్యలు పోలీసులకు చేరలేదా. అయనను ఎందుకు అరెస్టు చేయలేదు." -పరిటాల సునీత, తెలుగుదేశం నేత

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. టీడీపీ కార్యకర్త జగ్గు బంధువు పద్మావతి ఆరోపించారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

ఎవరి కుట్రలో భాగంగా లోకేశ్​ను టార్గెట్ చేశామని చందు అన్నారో పోలీసులే తేల్చాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి డిమాండ్ చేశారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆయన తెదేపా జిల్లా కార్యాలయంలో మాణిక్యాలరావుతో కలసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజున చెప్పిందేంటి.. అనంతపురం జిల్లాలో జరిగిందేంటని ప్రశ్నించారు. ఆ విలువలు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, వారి సోదరులకు వర్తించవా అని నిలదీశారు. లోకేశ్​ పాదయాత్ర అని తెలిసినప్పటి నుంచి.. వైకాపా నాయకులు భయం పట్టుకుందన్నారు. జాకీ పరిశ్రమను జె ట్యాక్స్ దెబ్బకు వెళ్ళిపోయిందని.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో రాప్తాడులో డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. లోకేశ్​ను టచ్ చేయాలంటే లక్షలాది మంది పసుపు సైనికులను దాటుకుని వెళ్లాలని హెచ్చరించారు.

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మరియు అతని సోదరుడు చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వైకాపా ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు హెచ్చరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.