మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల ఆలయంలో డిక్లరేషన్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వెంటనే మార్చుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి.