అరాచక శక్తులకు అధికారమిస్తే ఆటవిక పాలనే చేస్తుందని.. వైకాపా కూడా అలాగే ప్రవర్తిస్తోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేసిన తెదేపా అభ్యర్థులకు రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని కాలవ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ కోరారు. కుట్రపూరితంగా ఎన్నికలు ఏకపక్షం చేసుకోవాలనే స్వార్థపు ఆలోచనలతో వైకాపా నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. పోలీసులను సైతం తమకు అనుకూలంగా మార్చుకొని దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు యత్నించడమే కాకుండా తమపై తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. జిల్లాలో జరిగిన సంఘటనలను ఎస్పీ పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'కేసుల్లో చిక్కుకున్న వైకాపా నేతలు.. రాజ్యసభకు క్యూ'