ETV Bharat / state

సామాన్య భక్తులను స్వామి వారికి దూరం చేసేందుకే ఈ నిర్ణయాలు - పయ్యావుల - Payyavula on TTD JEO's

Payyavula Fired on TTD : సామాన్య భక్తులను స్వామి వారి నుంచి దూరం చేసేందుకే తితిదే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని తెదేపా నేత పయ్యావుల కేశమ్ మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా దర్శనానికి వచ్చిన భక్తులు మొదటిసారిగా అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

TDP leader payyavula kesav fires on TTD
TDP leader payyavula kesav fires on TTD
author img

By

Published : Apr 13, 2022, 3:13 PM IST

Updated : Apr 13, 2022, 3:33 PM IST

Payyavula Fired on TTD : సామాన్య భక్తులను స్వామి వారిని దూరం చేసేందుకే తితిదే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని తెదేపా నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా దర్శనానికి వచ్చిన భక్తులు మొదటిసారిగా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మంగళవారం జరిగిన సంఘటలు ఇంకా పూర్తిగా సరిదిద్దే ప్రయత్నాన్ని అటు పాలకమండలిగానీ.. ఇటు ప్రభుత్వంగానీ.. ఇంకా చేపట్టలేదని అన్నారు.

తితిదే తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో దాదాపు 1500 రూములను మూసివేయడం.. కింద ఉన్న హోటళ్లలో వ్యాపారాల కోసమే అన్నట్లుగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన సేవలో తరించండానికి తమకు అభ్యంతరం లేదని.. అంత వరకు సామాన్య భక్తుల కోసం పని చేయాలని సూచించారు.

తిరుమలకు వెళ్లి రావాలి అంటే అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచ్చినట్టుందని అన్నారు. సుదర్శన టికెట్ తీసుకొని రెండు గంటల్లో స్వామి వారి దర్శనం చేసుకొని ఆనందంగా వెళ్లి వచ్చే కుటుంబ సభ్యులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా.. ఒక భక్తుడిగా, సామాన్య భక్తులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాని అన్నారు. ఆలయ చరిత్ర దెబ్బ తీసేందుకే తితిదే పాలకమండలి ఇలాంటి చర్యలు తీసుకుంటోందని పయ్యావుల ఆరోపించారు.

సామాన్య భక్తులను స్వామి వారిని దూరం చేసేందుకే ఈ నిర్ణయాలు -పయ్యావుల

ఇదీ చదవండి : CM Jagan : ‘అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిధి’.. సర్వం 'జగన్నాథం'!

Last Updated : Apr 13, 2022, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.