ETV Bharat / state

కంప్యూటర్​లో చాలా కష్టపడి కేతిరెడ్డి ఫొటోలు విడుదలు చేశాడు​: పరిటాల శ్రీరామ్​ - ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్​ఛార్జి పరిటాల

PARITALA SRIRAM FIRES ON YCP MLA KETHIREDDY : సత్యసాయి జిల్లాలో అధికార విపక్షాల మద్య మాటల యుద్దం వేడెక్కింది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల వివాదంపై రోజుకో వివాదం రేగుతోంది. తాజాగా పరిటాల శ్రీరామ్ కేతిరెడ్డి భూ ఆక్రమణలపై​ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

PARITALA SRIRAM
PARITALA SRIRAM
author img

By

Published : Apr 8, 2023, 2:30 PM IST

PARITALA SRIRAM FIRES ON YCP MLA KETHIREDDY : ధర్మవరంలో ఎర్రగుట్ట భూమిని ఆక్రమించి, గుట్టమీద గుర్రాల కోట కట్టి.. కట్టుకథలతో ప్రజలను మోసం చేయోద్దంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్​ఛార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చేసిన ఆరోపణలను పరిటాల శ్రీరామ్ రెండు రోజుల క్రితం ఆధారాలతో సహా నిరూపించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మరోసారి సోషల్ మీడియాలో భూమి సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి విడుదల చేసిన చిత్రాలపై మరోసారి మీడియా ముందుకు వచ్చిన పరిటాల శ్రీరామ్.. కంప్యూటర్​లో చాలా ఇబ్బంది పడి భూమి చిత్రాలను విడుదల చేశారంటూ ఎద్దేవా చేశారు.

ఆక్రమణ లేకపోతే, ప్రత్యక్షప్రసారం ద్వారా భూమిని సర్వే చేయించి ఆక్రమణ లేదని నిరూపించుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డికి పరిటాల శ్రీరామ్​ సవాల్ విసిరారు. తన పేరు చెప్పి కబ్జాలు చేసే వారిని చెప్పుతో కొట్టాలని చెబుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఆయన పక్కనే ఉండి అక్రమాలు చేస్తున్న వారిని ఎవరు చెప్పుతో కొట్టాలో ఆయనే చెప్పాలన్నారు. సామాన్య రైతులు భూమిని ఆక్రమిస్తే నిబంధనలు చూపుతున్న అధికారులు, కొండను ఆక్రమించిన ఎమ్మెల్యేను పట్టించుకోరా అంటూ శ్రీరామ్ ప్రశ్నించారు.

జగన్​ తరహాలో మోసం చేయడం లోకేశ్​కు తెలియదు: తమ నేత లోకేశ్​ పాదయాత్రను విమర్శిస్తున్న ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్​ తరహాలో ముద్దులు పెట్టి మోసం చేయటం లోకేశ్​కు తెలియదన్నారు. సీఎం మాదిరిగా నాటకాలు ఆడటం తెలియదని, అందువల్లే చేయగలిగేదే ప్రజలకు చెబుతూ యువగళం పాదయాత్ర సాగిస్తున్నారని శ్రీరామ్ చెప్పారు. తన నేత లోకేశ్​ గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని శ్రీరామ్ హెచ్చరించారు.

ఫొటోలు విడుదల చేసిన లోకేశ్​: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎర్రగుట్టను ఆక్రమించారంటూ లోకేశ్​ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి సంబంధించిన పలు ఆధారాలను బయటపెడుతూ ఈ నెల4న ఓ ప్రకటన విడుదల చేశారు. ఎర్రగుట్టపై 20 ఎకరాలు కబ్జా చేసి విలాసవంతమైన భవనంతో పాటు బోటింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారని పాదయాత్ర సందర్బంగా లోకేశ్​ ఆరోపించారు. అయితే లోకేశ్​ కామెంట్లపై స్పందించిన ఎమ్మెల్యే.. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానని సోమవారం సవాల్‌ చేశారు. ఈ క్రమంలో లోకేశ్‌ మంగళవారం ఎర్రగుట్ట ఆక్రమణపై ఆధారాలను బయటపెట్టారు.

కంప్యూటర్​లో చాలా కష్టపడి ఫొటోలు విడుదలు చేశావ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.