ETV Bharat / state

Kalva Srinivasulu House Arrest: రాయదుర్గంలో హైటెన్షన్​.. టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు హౌస్​ అరెస్టు

author img

By

Published : Jul 8, 2023, 1:53 PM IST

TDP Leader Kalva Srinivasulu House Arrest: ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పర్యటన సందర్భంగా పోలీసులు రాయదుర్గంలో ఆంక్షలు విధించారు. రాయదుర్గంలో ర్యాలీకి పిలుపునిచ్చిన టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులును పోలీసులు గృహనిర్బంధం చేశారు.

TDP Leader Kalva Srinivasulu House Arrest

TDP Leader Kalva Srinivasulu House Arrest: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఓ వైపు ముఖ్యమంత్రి పర్యటన.. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల నిరసనలతో జిల్లా ఉడుకెత్తిపోతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటన సందర్భంగా పోలీసులు రాయదుర్గంలో భారీ ఆంక్షలు విధించారు. కాగా .. కాల్వ శ్రీనివాసులుకు నోటీసులు జారీ చేయడానికి పోలీసులు వెళ్లగా వాటిని ఆయన నిరాకరించారు. రాయలసీమకు సాగునీరు అందించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రాయదుర్గం పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేయడానికి కాలవ పిలుపునిచ్చారు. దీంతో ర్యాలీ చేయడానికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకొని నోటీసులు ఇచ్చారు.

ఈ సందర్భంగా కాల్వ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాయలసీమను సస్య శ్యామలం చేయడానికి దుర్భిక్ష నివారణ పథకం కింద 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించి, 3000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని కాల్వ దుయ్యబట్టారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందించే హంద్రీనీవా, గాలేరు హగరి, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందించే కార్యక్రమం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"రాయలసీమ బాగు కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో 32వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ప్రకటించిన జగన్​ రెడ్డి.. ఈ నాలుగేళ్లలో మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. రాయలసీమకు జీవనాడి లాంటి హంద్రీనీవా, గాలేరు నగరి, అలాగే అనంతపురం జిల్లాకు అత్యంత ప్రధానమైన జీడిపల్లి బీటీపీ, జీడిపల్లి పేరూరు, ఉరవకొండలో 50వేల ఎకరాలకు సాగునీరు అందించే బిందు సేద్యం ప్రాజెక్టు ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి."-కాల్వ శ్రీనివాసులు, టీడీపీ నేత

జీడిపల్లి నుంచి బీటీపీకి, పేరూరు డ్యామ్​కు, ఉరవకొండ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం కార్యరూపం దాల్చలేదన్నారు. నది జలాలు తరలించకుండా రాయలసీమ ప్రాంతాలకు సీఎం ఎలా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి, సాగు నీరందించడానికి ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రాయదుర్గంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తీరుతామని కాలవ ప్రకటించారు. రెండేళ్ల క్రితం రాయదుర్గం పర్యటనలో సీఎం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కాలవ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.