విపత్తుల కారణంగా రైతులు 2వేల కోట్ల రూపాయల పంట పెట్టుబడులు నష్టపోతే ప్రభుత్వం కేవలం 38కోట్ల రూపాయలు ఇవ్వడమేంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు నిలదీశారు. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలుగా మారిపోయి ఒక్క రైతుకూ మేలు చేయట్లేదన్నారు. చేతనైతే తెదేపా ప్రభుత్వం చేసిన సాయం కంటే ఎక్కువ రైతులకు చేసి చూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ ముఖ్య విధానం చూస్తుంటే... చంద్రబాబు, లోకేశ్ ను విమర్శించటమే తప్ప చేసేదేం లేదన్నారు. అనంతపురంలో లోకేశ్ పర్యటించటం మంత్రులకు మింగుడుపడటం లేదన్నారు.
ఇదీ చదవండి