తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లోకి కలపటం వల్ల నేడు ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగుతోందని తెదేపా నేత కాలువ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో మాట్లాడిన ఆయన... ఏడాది తర్వాత ప్రజల్లోకి వచ్చిన సీఎం జగన్... వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయక ముందే తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లోకి కలుపుకున్నట్లు కాలువ వెల్లడించారు.
వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్ల పోలవరం నిర్మాణాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారని... గ్రావిటీ ద్వారా నీరు అందించే విషయంలో ముఖ్యమంత్రికి అవగాహన లేదని కాలవ శ్రీనివాసులు ఆక్షేపించారు. జగన్ సోదరి షర్మిల చెప్పినట్లు ఎన్నికలకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేసుకున్న రహస్య ఒప్పందంతో రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా ఐదేళ్ల పాలనలో హంద్రీనీవాకు రూ.ఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టామని స్పష్టం చేశారు.
ఇదీచదవండి.