కరవు పీడిత అనంతపురం జిల్లాకు ప్రాణాధారమైన తుంగభద్ర ఎగువకాలువ నిర్వహణ పట్ల జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల అత్యంత విలువైన నీరు ఏటి పాలవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. హెచ్‌ఎల్‌సీకి రాష్ట్ర సరిహద్దులో విడుదలైన నీరు మొత్తం హీరేహల్ మండలం చెర్లోపల్లి సమీపంలో హాగరి నదికి వదిలి పెట్టారన్నారు. వారం క్రితం ప్రారంభించిన కనేకల్లు చెరువు గేట్ల మరమ్మతులు పూర్తికానందున నీటిని ఏటికి వదిలారన్నారు.
నాలుగైదు నెలల కిందట చేయాల్సిన రిపేర్లను.. నీరొచ్చే సమయానికి మొదలుపెట్టడమేమిటని ప్రశ్నించారు. కాలువలో వచ్చిన నీటిని వచ్చినట్లు ఏటిపాలు చేసిన పాపం ఈ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. ఎస్కేప్ ఛానల్ గేట్లు ఎత్తించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. విలువైన నీటిని వృధా చేయడంపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Eluru Elections results : వైకాపా ఖాతాలో ఏలూరు కార్పొరేషన్..మూడుచోట్ల తెదేపా విజయం