JC Prabhakar Reddy on DSP: తెదేపా కార్యకర్తలపై తాడిపత్రి డీఎస్పీ చైతన్య అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల వ్యవహారంపై తాడిపత్రిలో జేసీ మండిపడ్డారు. శాంతియుతంగా ఏ కార్యక్రమం చేయాలన్నా అనుమతి నిరాకరించే డీఎస్పీ.. వైకాపాలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గణేష్ విగ్రహం పెట్టాలన్నా, శాంతియుత ఆందోళన చేస్తామన్నా దేనికీ అనుమతి ఇవ్వని డీఎస్పీ.. పద్ధతి మార్చుకోవాలని జేసీ హెచ్చరించారు.
తప్పుడు కేసులతో తమను బెదిరించాలని చూస్తే.. అది సాధ్యం కాదని.. ఇలాంటి బెదిరింపు కేసులు చాలా చూశామని జేసీ అన్నారు. తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్న వారిపై కేసులు పెట్టకుండా.. డీఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే తమపైనే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఎంత విధేయత చూపినా తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ రాదని జేసీ ప్రభాకర్ రెడ్డి.. డీఎస్పీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: