అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు పరామర్శించారు. ఈ సందర్బంగా ఆ కుటుంబాలకు రూ. 1.75 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ. ఐదు వేల చొప్పున ఇచ్చారు. ఆ కుటుంబాలకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇప్పటికే నియోజకవర్గంలో చంద్రన్న స్ఫూర్తితో ఉమన్న సాయం అనే కార్యక్రమం ద్వారా వందలాది కుటుంబాలను ఉమామహేశ్వర నాయుడు ఆర్థికంగా ఆదుకున్నారు. తాజాగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తెదేపా కేడర్లో ఉత్సాహం నింపారు.
ఇదీ చూడండి: