అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంకటాపురం గ్రామంలో తెదేపా నేత ఇంటికి అడ్డుగా వైకాపా నాయకులు బండలు నాటిన విషయంపై... అరా తీసేందుకు జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల, బీటీ. నాయుడు ఆ గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఠాణాకు తరలించారు. పోలీసులు తెదేపా నేతలను అడ్డుకోవడం కారణంగా... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా నేతల తీరును జేసీ దివాకర్ రెడ్డితో పాటు... తెదేపా నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.
ఇవీ చదవండి... పోలీసులను తప్పించుకోబోయి.. కాల్వలో పడిపోయి!