ETV Bharat / state

'కొడాలి నాని నియోజకవర్గంలో పేకాట జూదంపై ప్రభుత్వం నోరు విప్పాలి' - poker gambling issue news

గుడివాడ నియోజకవర్గంలో జరిగిన పేకాట జూదంపై.. మంత్రి కొడాలి నాని కనుసన్నుల్లోనే జరుగుతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలో కోట్ల రూపాయల పేకాట జూదంపై ప్రభుత్వం నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

tdp ex mla fires on government to reveal about poker gambling issue in minister kodali nani constituency
'కొడాలి నాని నియోజకవర్గంలో పేకాట జూదంపై ప్రభుత్వం నోరు విప్పాలి'
author img

By

Published : Jan 4, 2021, 9:01 PM IST

మంత్రి కొడాలి నాని నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో జరుగుతున్న పేకాట జూదంపై ప్రభుత్వం నోరు విప్పాలని.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్​చౌదరి డిమాండ్ చేశారు.

గుడివాడ నియోజకవర్గంలో జరిగిన పేకాట జూదం.. మంత్రి కొడాలి నాని కనుసన్నుల్లోనే జరుగుతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. సీఎంకు అత్యంత ప్రీతిపాత్రుడైన మంత్రి నియోజకవర్గంలో జరిగిన జూదం వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న జయరాం నియోజకవర్గంలో భారీ ఎత్తున క్రికెట్ బెట్టింగ్ జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మంత్రుల నియోజకవర్గాల్లో జూదం, క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే.. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మంత్రులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే.. సామాన్య ప్రజల భవిష్యత్ మాటేమిటని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సజ్జల, కొడాలి మధ్య వాటాల తేడాలతో బయటపడ్డ పేకాట శిబిరాలు: దేవినేని

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.