లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, నాయకులపై చర్యలు తీసుకోవాలని బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్‌కు తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు వినతిపత్రం అందజేశారు. శింగనమల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు చైర్మైన్ ప్రమాణస్వీకారోత్సవం అట్టహసంగా చేపట్టారని అన్నారు. లాక్ డౌన్ అమలవుతున్న వేళ శింగనమల ఎమ్మెల్యే, నాయకులు వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా సామాజిక దూరం పాటించకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
ఇది చదవండి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై సర్వే..ఉత్తర్వులు జారీ