నెలరోజుల పాటు అనంతపురం జిల్లా కదిరిలోని షెల్టర్ హోమ్‌లో ఉన్న తమిళనాడుకు చెందిన కూలీలను అధికారులు వారి స్వరాష్ట్రానికి పంపించారు. లాక్డౌన్ వల్ల హైదరాబాద్ నుంచి తమిళనాడుకు వెళ్తున్న 20 మంది యువకులు కదిరిలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వలస కార్మికులు వారి ప్రాంతాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, తహసీల్దార్ మారుతి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మండల రెవెన్యూ అధికారి మారుతీకి వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.
స్వరాష్ట్రానికి బయల్దేరిన తమిళనాడు వలసదారులు
అనంతపురం జిల్లా కదిరిలో షెల్టర్ హోమ్‌లో ఉన్న తమిళనాడుకు చెందిన కూలీలను అధికారులు వారి ప్రాంతానికి పంపించారు. మొత్తం 20 మంది వలసదారులకు కరోనా పరీక్షల అనంతరం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వరాష్ట్రానికి తరలించారు.
నెలరోజుల పాటు అనంతపురం జిల్లా కదిరిలోని షెల్టర్ హోమ్‌లో ఉన్న తమిళనాడుకు చెందిన కూలీలను అధికారులు వారి స్వరాష్ట్రానికి పంపించారు. లాక్డౌన్ వల్ల హైదరాబాద్ నుంచి తమిళనాడుకు వెళ్తున్న 20 మంది యువకులు కదిరిలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం వలస కార్మికులు వారి ప్రాంతాలకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, తహసీల్దార్ మారుతి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మండల రెవెన్యూ అధికారి మారుతీకి వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: క్వారంటైన్ కేంద్రాల్లో వలసకూలీల అవస్థలు