అనంతపురం జిల్లా బేలుగప్ప మండల తహసీల్దార్ కార్యాలయం అధికారులు కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి స్థలాల రిజర్వేషన్ కోసం ప్రజలను రమ్మనటంతో వారు పెద్దఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. గుంపులు గుంపులుగా చాలామంది కనీసం మాస్కులు లేకుండా వచ్చారు. భౌతిక దూరం మచ్చుకైనా కనపడలేదు.
వచ్చిన జనానికి కార్యాలయంలో స్థలం సరిపోక దగ్గర్లోని కల్యాణ మంటపంలో అధికారులు రిజిస్ట్రేషన్ పనులు చేశారు. కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ఇంతమందిని ఒకేసారి అనుమతించడం విమర్శలకు తావిస్తోంది. గతంలో ఇక్కడ ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు.
ఇవీ చదవండి: