అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి గ్రామ సమీపంలో మణికంఠ(15) అనే బాలుడు వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ఈత కొడుతూ బావిలో మునిగిపోయాడు. చాలా సేపటికీ బయటకు రాలేదు. స్నేహితులు, గ్రామ ప్రజలు బావిలో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సహకారంతో పోలీసులు బావిలో నీటిని తోడించారు. బాలుడి మృత దేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...