ETV Bharat / state

భూవివాదాలకు పరిష్కారం...భూముల రీసర్వే! - Survey of India lands re-survey is going on in Anantapur district.

అనంతపురం జిల్లాలో సర్వేఆఫ్ ఇండియా భూముల రీసర్వే కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 964 గ్రామాల్లో భూములు కొలిచి, హద్దులు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక చేశారు. తొలిదశలో 311 గ్రామాల్లో కొలత పనులను కేంద్ర సర్వేశాఖ మొదలుపెట్టింది. కొన్నిచోట్ల ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవటంతో రీసర్వేకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Anantapur district
అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వే
author img

By

Published : Mar 18, 2021, 8:04 PM IST

అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వే

భూతగాదాలు, సివిల్‌ కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ప్రభుత్వం భూముల సమగ్ర సర్వే చేపట్టింది. అనంతపురం జిల్లాలో భూములు రీసర్వేకి 964 గ్రామాలను గుర్తించారు. రీసర్వే బాధ్యతను సర్వే ఆఫ్‌ ఇండియాకు అప్పగించారు. తొలిదశలో 311 గ్రామాలను ఎంపిక చేసుకుని... సాంకేతిక పరిజ్ఞానం సాయంతో డిసెంబర్‌లో సర్వే ప్రారంభించారు. డ్రోన్ కెమెరాతో హద్దులు గుర్తిస్తూ సర్వే పనులు కొనసాగిస్తున్నారు. సమగ్ర సర్వేతో గ్రామాల్లో భూవివాదాలకు తెర పడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

భూముల రీసర్వేలో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానంతో వ్యవసాయ క్షేత్రాల్లో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి, రైతులకు యూనిక్ కార్డులు ఇస్తారు. ఇప్పటి వరకు 27 గ్రామాల్లో హద్దుల గుర్తింపు పూర్తయింది. ఇక భూముల్లో హద్దులు సరిచూసి, రాళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పరిజ్ఞానం వినియోగంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవటంతో... డ్రోన్ విడుదల చేసే భూమి కొలతల ఛాయాచిత్రాలు ప్రధాన సర్వర్‌కు వెళ్లడం లేదు. దీనివల్ల సమీపంలోని పట్టణానికో, నగరానికో వెళ్లి అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాలో కేవలం ఒకే డ్రోన్‌తోనే సర్వే చేస్తుండటం వల్ల... ఆరు నెలలలోపు తొలిదశ 311 గ్రామాల్లో పని పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ సమస్యలను అధిగమించి సర్వే పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.

అనుకున్న సమయానికి సమగ్ర సర్వే పూర్తి చేయడానికి సాంకేతిక పరికరాలు, నిపుణుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని.... ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సర్వేఆఫ్ ఇండియాకు దిశానిర్దేశం చేయాలని మండల సర్వేయర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ వైకాపా నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.