కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం - subramanya swamy rathostavam at parigi news
అనంతపురం జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో... శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Intro:యాంకర్ వాయిస్ .అనంతపురం జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో వెలసివున్న ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. సుబ్రహ్మణ్య షష్టి సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని పెన్నా నది తీరాన వెలసిన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉత్సవమూర్తులను అలంకరించిన రథంపై నుంచి వేడుకగా రథోత్సవం నిర్వహించారు రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు .ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిగి పోలీసులు నిర్వహించారు