అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో.. గడేకల్ గ్రామస్థులు, పాఠశాలల విద్యార్థులు 67వ జాతీయ రహదారిపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. గ్రామానికి అనుకొని ఉన్న జాతీయ రహదారిపై.. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పాఠశాలల విద్యార్థులు, గ్రామ ప్రజలు గ్రామంలోకి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని.. విద్యార్థులకు, ప్రజలకు ఏదైన ప్రమాదం జరిగితే ఎవరు భాద్యులని ప్రశ్నించారు. అండర్ గ్రౌండ్ ద్వారా రహదారి నిర్మాణం చేయాలని డిమాండ్ చశారు. అధికారులు.. ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పిన అనంతరం.. ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: