ప్రేమ విఫలమైందని ఓ ఐటీఐ విద్యార్థి రైలు కింద పడి చనిపోయిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. ఆత్మకూరుకు చెందిన విద్యార్థి సాయి అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదువుతున్నాడు. గత కొంతకాలంగా ముభావంగా ఉన్న సాయి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారంతోనే సాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని స్నేహితులు తెలిపారు.
ఇదీ చదవండి: