అనంతపురం జిల్లా తాడిమర్రిలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి పై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశారు. జనసేన పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు ఎంపీడీవో కార్యాలయంలో వైకాపా నాయకులు అనుమతించకపోవడంతో అక్కడికి మధుసూదన్ చేరుకున్నారు. పోలీసుల సమక్షంలోనే మధుసూదన్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వైకాపా నాయకుడు శ్రీనివాస రెడ్డి, మహేష్ గాయపడ్డారు. తాడిమర్రి నుంచి ధర్మవరానికి వస్తుండగా మరోసారి బత్తలపల్లిలో వైకాపా నాయకులు రాళ్ల దాడి చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోందని.. వైకాపా నాయకులకు తొత్తులుగా పోలీసులు పని చేస్తున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఆర్డీఓ మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు.
జనసేన నాయకుడి పై రాళ్ల దాడి
జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి పై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు నేతలకి గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా తాడిమర్రిలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి పై వైకాపా శ్రేణులు రాళ్ల దాడి చేశారు. జనసేన పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు ఎంపీడీవో కార్యాలయంలో వైకాపా నాయకులు అనుమతించకపోవడంతో అక్కడికి మధుసూదన్ చేరుకున్నారు. పోలీసుల సమక్షంలోనే మధుసూదన్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో వైకాపా నాయకుడు శ్రీనివాస రెడ్డి, మహేష్ గాయపడ్డారు. తాడిమర్రి నుంచి ధర్మవరానికి వస్తుండగా మరోసారి బత్తలపల్లిలో వైకాపా నాయకులు రాళ్ల దాడి చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో అరాచకం రాజ్యమేలుతోందని.. వైకాపా నాయకులకు తొత్తులుగా పోలీసులు పని చేస్తున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఆర్డీఓ మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:'హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారు'