అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సుప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు హోమాలు నిర్వహించారు. మడుగు తేరులో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని గోవింద, నారాయణ నామస్మరణతో ప్రతిష్ఠించారు. మేళతాళాలు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారి రథాన్ని భక్తులు ఆలయం చుట్టూ లాగారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో కొంతమంది అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్వామివారి క్రతువును ముగించారు. ప్రతి ఏటా నిర్వహించే శ్రీవారి రథోత్సవాన్ని రద్దు చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఇదీచూడండి. ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్