ETV Bharat / state

బోధనా సిబ్బంది లేరు.. రాయలసీమ ఎస్కేయూలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు నిలిపివేత..! - ఎస్కేయూ

SKU law courses: మూడేళ్ల న్యాయవిద్య కోర్సు ప్రవేశాలు నిలిపేయాలంటూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్న న్యాయవిద్య విద్యార్థులకు సమాధానం చెప్పలేకే.. ఏకంగా కోర్సునే ఎత్తేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్కేయూలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరిగినా ఏ విద్యార్థి నోరు విప్పకూడదనే తరహాలో చర్యలు ఉన్నాయంటూ.. విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

Sri Krishnadevaraya University
Sri Krishnadevaraya University
author img

By

Published : Dec 7, 2022, 10:55 AM IST

Sri Krishnadevaraya University law courses: రాయలసీమ యువతకు మూడేళ్ల న్యాయవిద్యను అందించే ఏకైక వర్సిటీ.. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎస్కేయూలో న్యాయవిద్య కోర్సును నిలిపివేసేందుకు యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరంలో..... మూడేళ్ల లా కోర్సు వెబ్ కౌన్సిలింగ్ నుంచి ఎస్కేయూ పేరు తొలగించాలని.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కు వర్సిటీ యంత్రాంగం లేఖ రాసింది. ఎంతోమంది న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను అందించిన ఎస్కేయూ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశాలను నిలిపేయడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలో కేవలం ఎస్కేయూ, ఆంధ్ర విశ్వద్యాలయం, తిరుపతి పద్మావతి వర్సిటీల్లోనే మూడేళ్ల న్యాయవిద్య కోర్సులు ఉన్నాయి. పద్మావతి మహిళా వర్సిటీలో కేవలం మహిళలకు మాత్రమే కోర్సులు నిర్వహిస్తున్నారు. 1976లో తిరుపతి నుంచి పీజీ సెంటర్ అనంతపురానికి బదిలీ అయినప్పటీ నుంచి ఇక్కడ న్యాయవిద్య కొనసాగుతోంది. ఏటా 88 సీట్లతో మూడేళ్ల న్యాయవిద్య కోర్సు నిర్వహిస్తున్న ఎస్కేయూ... ఈ ఏడాది నుంచి ప్రవేశాలు నిలిపివేస్తున్నట్లు వర్సిటీ ఉపకులపతి, రిజిస్టార్‌లు నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ అధికారుల తీరుతో రాయలసీమ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు

విద్యార్థులు, అధ్యాపకులు తక్కువగా ఉన్న అనేక విభాగాలను కొనసాగిస్తున్న ఎస్కేయూ యంత్రాంగం... సిబ్బంది కొరత పేరుతో... న్యాయ విద్య కోర్సును తొలగించడాన్ని విద్యార్థులు తప్పుపడుతున్నారు. న్యాయవిద్య కోర్సు ప్రవేశాల నిలుపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు.

'ఎస్కేయూలో విద్యార్థులే లక్ష్యంగా ప్రశ్నించే నోళ్లను బెదిరింపులతో మూయిస్తున్నారు. హాస్టల్ మెస్ లో భోజనం నాణ్యతగా లేదనో, చదువు చెప్పే అధ్యాపకుల కొరత ఉందని కూడా ఎక్కడా గళం విప్పకూడదని అధికారులు హుకుం జారీచేశారు. చెప్పన మాట వినకుండా హక్కులు, నిరసనలంటూ రోడ్డెక్కితే వర్సిటీ నుంచి డీటెైన్ కు గురికాక తప్పదు. ఇప్పటికే సైన్సు, ఆర్ట్స్ విద్యార్థుల ప్రశ్నించే హక్కును, అధికారుల అక్రమాలపై ఉద్యమిస్తున్న వారికి హెచ్చరికలు చేసి, నోటీసులిచ్చారు. లా విద్యార్థులు తమ దారికి రావటంలేదని, ఏకంగా మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సునే ఎత్తివేయటానికి నిర్ణయించారనే విమర్శలున్నాయి. ఎస్కేయూ అధికారుల నిర్ణయంపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.'- ఎస్కేయూ లా విద్యార్థులు

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.