అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానుపల్లి గ్రామంలో లక్ష్మి అనే గ్రామ వాలంటీర్‌పై దాడి ఘటన కలకలం సృష్టించింది. కరోనా వైరస్ ప్రభావంపై ఇంటింటి సర్వే చేస్తుండగా... రాజంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామానికి వచ్చారని తెలిసి వాలంటీర్ లక్ష్మి అభ్యంతరం తెలిపింది. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని.. గ్రామానికి ఎవరూ రాకూడదని చెప్పింది. వారిని వెళ్లిపోవాలని కోరింది.
అయితే తమను ఊరి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడానికి మీరెవరంటూ ఐదుగురు.. వాలంటీర్ లక్ష్మిపై దాడి చేశారు. గాయాలపాలైన లక్ష్మి.. పోలీసులను ఆశ్రయించింది. గ్రామానికి కొత్తగా వచ్చిన వారిని గుత్తిలోని క్వారంటైన్‌కు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: