అనంతపురం జిల్లా కదిరి మండలం సోమేశ్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును పులివెందుల వైపు నుంచి వస్తోన్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కదిరి డిపో మేనేజర్, సిబ్బంది ఆసుపత్రికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: లుంగీతో భార్యను హత్యచేసిన భర్త