కరోనా కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దాతలు సహాయం చేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని కళా జ్యోతి ఆవరణంలో 200 మంది కార్మికులకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. ఒక్కో కార్మికుడికి రూ.వెయ్యి చొప్పున నగదు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యదర్శి వజ్జల శ్రీనివాసులు, వెంకటస్వామి, వెంకటయ్య, అశ్వర్థ ,నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: