ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత.. బెల్లం ఊట ధ్వంసం

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఎస్​ఈబీ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 2,304 మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. విశాఖ జిల్లాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేసి... 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.

liquor seized
మద్యం పట్టివేత
author img

By

Published : Jan 30, 2021, 10:55 AM IST

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్ చెక్ పోస్ట్ వద్ద ఎస్​ఈబీ సిబ్బంది, పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం భారీ స్థాయిలో పట్టుబడింది. ఇరవై నాలుగు పెట్టెల్లో 2,304 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకు విలువ రూ.1,20,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కారులో ఉన్న వ్యక్తి మద్యం బాక్సులను అక్కడే వదిలేసి పరారయ్యాడని... వాహనాన్ని సీజ్​ చేశామని ఉరవకొండ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

విశాఖ జిల్లా :

చీడికాడ మండలం దిబ్బపాలెం సమీపంలోని పోతలవారి కళ్లాల ప్రాంతంలో నాటుసారా తయారీ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే 1500 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. సారా తయారీ చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంతోశ్​ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై నిఘా: ఎస్పీ సత్యఏసుబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.