ETV Bharat / state

480 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - మడకశిర వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు.. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ బియ్యాన్ని కర్నూలు నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

Seizure of 480 bags of ration rice in madakaseera
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Sep 21, 2020, 11:15 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం రేకులకుంట పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. లారీలో 480 బస్తాల పీడీఎస్ చౌక బియ్యం పట్టుబడింది. వీటికి సంబంధించిన సరైన పత్రాలు లేని కారణంగా... చౌక బియ్యం కలిగిన లారీని పోలీసులు స్టేషన్​కు తరలించారు.

లారీ డ్రైవర్, క్లీనర్​ను పోలీసులు ప్రశ్నించారు. కర్నూలు నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు వారు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట ఇదే చెక్ పోస్ట్ వద్ద కర్నూలు నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 18 టన్నుల చౌకబియ్యం పట్టుబడింది.

ఇదీ చదవండి:

బీ అలర్ట్​: కస్టమర్​ కేర్​ అంటారు... ఖాతాలు ఖాళీ చేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.