కరోనా కట్టడిలో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని పలు దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా దుకాణాల్లో సరుకులు విక్రయిస్తున్న 5 దుకాణాలపై 20వేల వరకు జరిమానాలు విధించారు. ఎవరైనా అనధికారికంగా దుకాణాలు తెరిచిన.. నిబంధనలు పాటించకుండా ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి అందరూ సహాయంగా ఉండాలన్నారు.
ఇదీ చూడండి. 'వారికి ప్రత్యేక ఆసుపత్రులు కేటాయించే పరిస్థితి ప్రస్తుతం లేదు'