అనంతపురం జిల్లా బ్రాహ్మణపల్లి ఎస్బీఐ బ్యాంకులో, ఒక తాత్కాలిక ఉద్యోగి అరకోటికిపైగా నగదు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న ఖాతాదారులు, పలువురు కమ్యూనిస్టు నాయకులు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళనచేపట్టారు. తమ సొమ్ముకు ఎవరిది బాధ్యత అంటూ బ్యాంకు అధికారులను నిలదీశారు. తాము చమటోడ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకు ఉద్యోగి ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలోనే చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు సర్దిచెప్పారు.
ఇది చూడండి: ఎస్బీఐ ఉద్యోగి చేతివాటం- అరకోటికిపైగా స్వాహా