ETV Bharat / state

వరుణుడు కరుణించే.. రైతన్న పులకించే

అనంతపురం జిల్లాను వరుణుడు కరుణించాడు. ఈసారి నైరుతి రుతుపవనాలు అన్నదాతకు అండగా నిలిచి పుష్కలంగా వర్షాలనిచ్చాయి. ఏటా చినుకు కోసం ఎదురు చూసే అనంత రైతు, ఈసారి జూన్ నుంచే ఏరువాక పనులు మొదలు పెట్టాడు. గ్రామస్థాయిలో వేరుశనగ విత్తనం పంపిణీ చేయటం వల్ల, రైతులందరికీ వాన కురిసే లోపే చేతిలో విత్తనం ఉంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండు మండలాలు మినహా 61 మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది.

satisfied rains at ananthapur
అనంతపురంలో సంతృప్తికరంగా వర్షాలు
author img

By

Published : Aug 12, 2020, 7:37 PM IST

అనంతపురంలో సంతృప్తికరంగా వర్షాలు

అనంతపురం జిల్లాలో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఏటా చినుకు జాడలేక ఆకాశం వైపు దీనంగా చూసే రైతు ఈసారి క్షణం తీరక లేనంతగా వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసిన కారణంగా.. వ్యవసాయశాఖ అంచనాలకు తగ్గట్లుగా పంటల సాగు కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 3 నెలల కాలంలో నేటి వరకు 102 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సీజన్ మొదలైనప్పటి నుంచి ఆగస్టు పదో తేదీ వరకు అనంతపురం జిల్లాలో 154.3 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా... 312.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 63 మండలాలకు గాను రొద్దం, ముదిగుబ్బ మినహా మిగిలిన 61 మండలాల్లో సాధారణం మించి వర్షపాతం నమోదైంది. ఆ రెండు మండలాల్లో మాత్రం సాధారణ స్థాయిలోనే వర్షం కురిసింది. ఈసారి మంచి వర్షాలు నమోదైనట్లు అర్థగణాంక శాఖ అధికారులు చెబుతున్నారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సకాలంలో వర్షాలు కురిశాయి. ఈసారి సాధారణ వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదిక మేరకు జిల్లాలో ఏడు లక్షల 60 వేల హెక్టార్లలో పంటలు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు నమోదయ్యాయి. జూన్, జూలై, ఆగస్టు పదోతేదీ వరకు కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా 6.83 లక్షల హెక్టార్లలో పంటలు సాగుచేశారు.

జిల్లాలో సింహభాగం విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతోంది. ఇందుకు తగినట్లుగా ప్రభుత్వం ఈసారి రైతులకు గ్రామస్థాయిలోనే విత్తనం అందించింది. ఫలితంగా.. రైతులకు ఖర్చు, శ్రమ తగ్గి, ఇంటి వద్దకే సకాలంలో విత్తనం చేతికొచ్చింది. దాదాపు 15 రోజుల శ్రమ కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. మరోవైపు.. సకాలంలో వర్షాలు కురిసి నేల పదును కాగానే రైతులంతా వేరుశనగ విత్తనం వేశారు. జిల్లాలో ఈసారి 4.90 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేయగా అంచనా మేరకు సాగులోకి వచ్చింది. ఈఏడాది సీజన్ చాలా బాగుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

వర్షాధార భూముల్లో విత్తనం సకాలంలో వేసినందున సెప్టెంబర్, అక్టోబర్ నెలలు పంటలకు చాలా కీలకమైన సమయంగా చెప్పవచ్చు. పంట కీలకదశలో మరో రెండుసార్లు పుష్కలంగా వర్షాలు కురిస్తే ఈసారి రైతుకు బంగారు పంట చేతికొచ్చినట్లేనని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి:

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.