ETV Bharat / state

"ఎమ్మెల్యే గన్​మెన్లు బెదిరించారు" - Sarpanch candidate Allegation on local mla in Vepulaparthi panchayat

స్థానిక ఎమ్మెల్యే బెదిరించి తన నామినేషన్​ను ఉపసంహరించుకునేలా చేశారని ఓ సర్పంచ్ అభ్యర్థి ఆరోపించారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి పంచాయతీలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

sarpanch candidate
"ఎమ్మెల్యే గన్మెన్లు బెదిరించారు"
author img

By

Published : Feb 9, 2021, 12:24 PM IST

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి పంచాయతీకి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి... వైకాపా మద్దతుదారులుగా నామినేషన్ వేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే గన్​మెన్లు, ఇతర మండలాలకు చెందిన నాయకులు బెదిరించి తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. తమ పంచాయతీలో బలవంతపు విత్​డ్రా చేయించారని ఆంజనేయులు కుటుంబ సభ్యులు విమర్శించారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని రీ పోలింగ్ జరపాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... కృష్ణా జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.