ఆపత్కాలంలో పేదలకు అండగా నిలుస్తున్న 'ఆర్డీటీ' - అనంతపురం రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు న్యూస్
లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లాలో నిరాశ్రయులైన వారికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) అండగా నిలుస్తోంది. కరోనాపై పోరు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఆర్డీటీ.. కష్టకాలంలో పేదల ఆకలిని తీరుస్తోంది. భౌతిక దూరం పాటించేలా ప్రజల్లో చైతన్యం తెస్తూనే...వారి కడుపు నింపుతుంది. కరోనా భూతాన్ని తరిమేందుకు తమ సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయంటున్న ఆర్డీటీ డైరెక్టర్ విశాఫెర్రర్తో మా ప్రతినిధి ముఖాముఖి..!