అనంతపురం జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలి చలాన్ల(FAKE CHALLANS) రిజిస్ట్రేషన్‌ల డొంక కదులుతోంది. 2018-19 లో 16 నకిలీ చలాన్లతో ఆరు దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేశారు. మరో 38 దస్తావేజులు సొమ్ము ప్రభుత్వానికి జమ కాకుండానే రిజిస్ట్రేషన్ చేసి పంపించారు. ఇప్పటివరకు 21.29 లక్షల రూపాయలు ప్రభుత్వానికి జమ కాకుండానే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లు చేసినట్లు ప్రత్యేక బృందాల తనిఖీల్లో గుర్తించారు. ఇద్దరు ఇంటి దొంగలే ఈ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచినట్లు ఆధారాలతో ఉద్యోగులను విచారిస్తున్నారు. వంద రూపాయలు చెల్లించి పీడీఎఫ్ పార్మాట్‌తో అసలు చలాను నెంబర్ మీదనే నకిలీది తయారు చేస్తున్నారు.
ఇదీ చదవండి: